వయనాడ్ ఎంపీ ప్రియాంకతో సీఎం రేవంత్, భట్టి భేటీ

-

ఏఐసీసీ అగ్రనాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న వీరిద్దరు ఇటీవల వయనాడ్ ఎంపీగా గెలిచిన ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తొలిసారి ఎంపీగా గెలుపొందిన ప్రియాంక గాంధీకి పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు.

వయనాడ్ ఎంపీగా భారీ మెజారిటీతో విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. అనంతరం ప్రియాంకతో సమావేశమై తెలంగాణ రాజకీయాల గురించి చర్చించారు. అంతకుముందు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న తెలంగాణ ఎంపీలతో సీఎం రేవంత్ సమావేశం అయ్యారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న తెలంగాణ అంశాలపై పార్లమెంటులో ప్రశ్నించాలని వారికి సూచించారు. ఇక సోమవారం రాత్రి స్పీకర్ ఓం బిర్లా కూతురు వివాహ వేడుకకు సీఎం రేవంత్ హాజరైన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version