ట్రంప్ అరెస్టుపై ఇంటర్పోల్ కి ఇరాన్…!

యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ఏడాది క్రితం జరిగిన ఇరాన్ టాప్ జనరల్ కస్సేమ్ సోలైమాని హత్యకు సంబంధించి కనెక్షన్ ఉందని టెహ్రాన్ ఇంటర్పోల్కు దరఖాస్తు చేయడం జరిగింది. ఈ విషయాన్నిఇరాన్ న్యాయ ప్రతినిధి ఘోలం హుస్సేన్ ఇస్మాయిలీ ఇరాన్ స్టేట్ టెలివిజన్‌లో మంగళవారం వెల్లడించారు. అయితే దీనికి సంబంధించి ట్రంప్ తో సహా 48 వ్యక్తులకి, యుఎస్ కమాండర్లకి మరియు పెంటగాన్ ప్రతినిధులకి ‘రెడ్ నోటీసు’ దాఖలు చేసినట్టు ఇస్మాయిలీ చెప్పారు.

అలానే ఈ విషయానికి సంబంధించి ఇరాక్‌ సహకారం ఉందని ప్రతినిధి తెలియజేయడం జరిగింది. అయితే ఈ ఇంటర్‌పోల్ విషయానికి వస్తే… 1923 లో ఈ ఇంటర్‌పోల్ ని స్థాపించడం జరిగింది. ఇదే 194 సభ్య దేశాలకు పోలీసింగ్ కార్యకలాపాలను (policing operations) జరుపుతుంది. ఇది ఇలా ఉండగా “రెడ్ నోటీసు” ను ఉపయోగించి ఒక దేశం మరొక దేశాన్ని ఒక వ్యక్తిని అరెస్ట్ చెయ్యమని కోరొచ్చు. అయితే జనవరి 3, 2020 న, ట్రంప్ సూచనల మేరకు యుఎస్ ఆర్మీ ఇరాక్ పర్యటనలో ఉన్న సోలేమానిని రాకెట్ తో దాడి చేసి హత్య చేసింది. అలానే దీనిలో Iraqi milita లీడర్ అబూ మహదీ అల్-మోహందెస్, deputy head of Iraqu’s హష్ద్ అల్-షాబీ మిలీషియా కూడా చంపబడ్డారు.

సోలేమాని ఎలైట్ క్వాడ్ ఫోర్స్ కమాండర్. ఇరాక్ మరియు ఇతర దేశాలలో ఇరాన్‌కు విధేయులైన మిలీషియాల కార్యకలాపాలను ఆయన కోర్డినేట్ చేశారు. అధ్యక్షుడు హసన్ రోహని సోలైమానిని ఒక నేషనల్ హీరో అని పిలిచారు. ఈ హత్య తర్వాత ఆ ప్రాంతంలో ఒక లెజెండ్ అయ్యాడు. అయితే టెహ్రాన్ ఈ హత్యకి సంబంధించి ప్రతీకారం తీర్చుకుంటుందని, ట్రంప్, పెంటగాన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని రౌహానీ అన్నారు.