పశ్చిమాసియాలో మరో ఘర్షణ.. ఇరాక్‌పై ఇరాన్‌ క్షిపణి దాడి

-

ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధంతో ఇప్పటికే పశ్చిమాసియా అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం ప్రపంచ దేశాలను కలవరానికి గురి చేస్తోంది. ఇరు దేశాల మధ్య మంటలు చల్లారకముందే పశ్చిమాశియాలో తాజాగా మరో ఉద్రిక్తతకు తెరలేసింది. ఇరాక్‌లోని కుర్దిస్థాన్‌ ప్రాంతంపై ఇరాన్ దాడులకు తెగబడింది. ఎర్బిల్‌ పట్టణంలోని ‘గూఢాచార స్థావరాలు, ఇరాన్‌ వ్యతిరేక ఉగ్రవాద సంస్థల’ను లక్ష్యంగా చేసుకొని క్షిపణులు ప్రయోగించినట్లు ‘ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌’ ప్రకటించింది.

సిరియాలోని ఉగ్రవాద సంస్థ ‘ఇస్లామిక్‌ స్టేట్‌’ శిబిరాలను సైతం ధ్వంసం చేసినట్లు ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ వెల్లడించింది. ఇరాక్‌లో కుర్దిస్థాన్‌ ప్రాంతంలోని ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ మొస్సాద్‌ ప్రధాన కార్యాలయంపైనా దాడి చేసినట్లు ప్రకటించింది. ఈ దాడులను ‘కుర్దిష్‌ ప్రాంతీయ ప్రభుత్వ భద్రతా మండలి’ ధ్రువీకరిస్తూ ఇందులో నలుగురు పౌరులు మరణించినట్లు తెలిపింది. మరో ఆరుగురికి తీవ్ర గాయాలైనట్లు పేర్కొంది. ఇరాన్‌ దుందుడుకు చర్యలు తమ ప్రాంతంతో పాటు ఇరాక్‌ సార్వభౌమాధికారంపై దాడిగానే భావిస్తున్నామని కుర్దిష్‌ ప్రాంతీయ ప్రభుత్వ భద్రతా మండలి తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news