గాజా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 500 మంది దుర్మరణం

-

హమాస్​ను సమూలంగా నాశనం చేస్తానని ప్రతిన పూనిన ఇజ్రాయెల్ ఆ దిశగా చర్యలు వేగవంతం చేసింది. గాజాను అష్టదిగ్బంధనం చేసి దాడులకు తెగబడుతోంది. భీకర దాడుల్లో గాజా పౌరులు పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా గాజాలోని అల్-అహ్లీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఆస్పత్రిలో ఆశ్రయం పొందుతున్న వారు.. రోగులు 500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా శిథిలాల కింద అధిక సంఖ్యలో ప్రజలు చిక్కుకున్నారని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

దాడి జరిగిన సమయంలో ఆస్పత్రిలో గాయపడిన వారితో పాటు అధిక సంఖ్యలో శరణార్థులు ఆశ్రయం పొందుతున్నట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఘటనలో ఆస్పత్రి భవనం ధ్వంసమై చెల్లచెదురుగా పడిన శరీర భాగాలు ఉన్నట్లు ఫొటోలు బయటకు రావడంతో యావత్ ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దశాబ్దాలుగా జరుగుతున్న ఇజ్రాయెల్‌, పాలస్తీనా ఘర్షణల్లో ఇదే అతి పెద్ద దారుణ ఘటన అని ప్రపంచ దేశాలు చెబుతున్నాయి. అయితే ఆసుపత్రిపై దాడి విషయంలో తీవ్ర విమర్శలు రావడంతో ఇజ్రాయెల్ ఈ ఘటనపై స్పందించింది. గాజాలోని ఆస్పత్రిపై జరిగిన దాడిలో తమ ప్రమేయం లేదని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version