గాజాలో శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి.. 52 మంది దుర్మరణం

-

హమాస్‌ మిలిటెంట్లను హతమార్చడమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ నరమేధం సృష్టిస్తోంది. ఇజ్రాయెల్‌ భీకర దాడులతో ఆ ప్రాంత ప్రజలు ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ప్రపంచ దేశాలు వద్దని వారిస్తున్నా ఇజ్రాయెల్‌ సైన్యం మాత్రం ఎవరి మాటా లెక్కచేయడం లేదు. హమాస్​ను అంతం చేసే వరకు వెనక్కి తగ్గేదే లే అంటూ ఇప్పటికే పలుమార్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.

ఇప్పటికే గాజాలో మారణకాండ సృష్టిస్తున్న ఇజ్రాయెల్ తాజాగా గాజా స్ట్రిప్‌లోని శరణార్థి శిబిరంపై దాడికి తెగబడింది. ఈ దాడిలో 52 మంది మృత్యువాత పడ్డారు. ఈ దాడిలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని గాజా ఆరోగ్య అధికారులు అంచనా వేస్తున్నారు. గాజాపై దాడులకు కాస్త బ్రేక్ ఇవ్వాలని.. ఈ బ్రేక్​లో గాజా పౌరులకు సాయం అందేలా చేస్తామంటూ ఇజ్రాయెల్​కు అమెరికా విజ్ఞప్తి చేసింది. అమెరికా రిక్వెస్ట్ చేసిన కాసేపటికే శరణార్థి శిబిరంపై దాడి ఇజ్రాయెల్ దాడి చేసింది. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇప్పటివరకు 9,480 మంది పౌరులు మరణించినట్లు సమాచారం. అందులో మహిళలు, పిల్లలే ఎక్కువమంది ఉన్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news