బందీలను విడిచిపెట్టనన్న హమాస్.. యుద్ధం ఆపేదేలేదన్న ఇజ్రాయెల్

-

హమాస్‌ ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం రోజురోజుకు భీకర రూపం దాల్చుతోంది. ముఖ్యంగా హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఇరు వర్గాల మధ్య యుద్ధం మెుదలై రెండు నెలలు దాటుతున్నా ఇంకా చాలా మంది బందీలు హమాస్‌ చెరలోనే ఉన్నారు. ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా పలువురు బందీలను ఇరు వర్గాలు విడిచిపెట్టాయి. కానీ ఇంకా చాలా మంది బందీలుగానే ఉన్నారు. బందీలను విడుదల చేయాలని ఒకవైపు ఇజ్రాయెల్‌, మరోవైపు ప్రపంచ దేశాల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తుండగా బందీలను విడిచిపెట్టే ప్రసక్తే లేదని హమాస్ తేల్చి చెప్పింది. తమ షరతులను ఇజ్రాయెల్ అంగీకరించే వరకు వారిని వదిలిపెట్టమని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్‌ యుద్ధాన్ని ఆపేంత వరకు బందీలను విడిచిపెట్టేది లేదని హమాస్‌ సీనియర్‌ అధికారి ఒసామా హమ్దాన్‌ తెగేసి చెప్పారు.

బందీల విషయంలో హమాస్‌ చేసిన హెచ్చరికలను ఇజ్రాయెల్‌ ఏమాత్రం ఖాతరు చేయలేదు. గాజాపై సైనిక చర్య విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగబోమని తెగేసి చెప్పింది. బందీల విడుదలకు ఇది చాలా అవసరమని పేర్కొంది. హమాస్పై సంపూర్ణ విజయం సాధించే వరకు యుద్ధాన్ని కొనసాగిస్తామని ఇజ్రాయెల్ నెతన్యాహు స్పష్టం చేశారు. బందీలను సురక్షితంగా ఇళ్లకు చేర్చేందుకు తీసుకొంటున్న దౌత్య, సైనిక చర్యల తీవ్రతను ఇజ్రాయెల్‌ ఏమాత్రం తగ్గించబోదని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news