ఇజ్రాయెల్ మరియు పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ ల మధ్యన భీకర పోరు ఇంకా జరుగుతూనే ఉంది. ఇక తాజాగా ఇజ్రాయెల్ సైన్యం గాజా ప్రజలకు ఒక హెచ్చరికను పంపించింది. గాజాపై గ్రౌడ్ అటాక్ కు సర్వం సిద్ధం చేసుకుంటున్న ఈ సమయంలో అక్కడ నివసిస్తున్న అమాయక ప్రజలకు ఎటువంటి నష్టం కలగకూడని మన్హసి ఉద్దేశ్యంతో ఇజ్రాయెల్ వెంటనే ఉత్తర గాజాను ఖాళీ చేసి ఎక్కడికైనా సురక్షితమైన ప్రాంతానికి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇక్కడ పరిస్థితులు బాగు పడిన తరువాత రావొచ్చని తెలిపింది, ఎందుకంటే హమాస్ ఉగ్రవాదులు ఆయుధాలు మరియు సేనలతో మీ మధ్యనే ఉంటూ మీకు ఇబ్బంది కలిగించాలని చూస్తున్నారు..
కాబట్టి మీరు అక్కడి నుండి వెళ్ళిపోతే మేము వారి భరతం పడతామని ఇజ్రాయెల్ సూటిగా తెలియచేసింది. హమాస్ ను పూర్తిగా మట్టు పెట్టే వరకు ఆపరేషన్ జరుగుతూనే ఉంటుందంటూ సూచించింది. మరి ఈ సందేశాన్ని అర్ధం చేసుకుని వెంటనే ఉత్తర గాజాను ప్రజలు ఖాళీ చేస్తారా తెలియాల్సి ఉంది.