బైడన్ కంటే కమలాను ఓడించడమే సులభం.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ కంటే కమలా హ్యారీస్ ను ఓడించడం చాలా సులభమని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈశాన్య పెన్సిల్వేనియాలోని విల్కేస్-బారేలో జరిగిన ర్యాలీలో ట్రంప్ ప్రసంగించారు. కమలా హ్యారీస్ ఒక రాడికల్ అని అభివర్ణించారు. ఆమెను ఈజీగా ఓడించగలనని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆమె పిచ్చి పిచ్చిగా నవ్వుతుందని.. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రజలు గమనించారని నొక్కి చెప్పారు. కమలా హ్యారీస్ కంటే నేనే బాగుంటానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టైమ్ మ్యాగజైన్ లో ప్రచురించిన కమలా హ్యారీస్ స్కెచ్ పై ట్రంప్ ఈ ప్రకటన చేసారు. విదేశీ వస్తువులపై బోర్డు అంతటా సుంకాలు విధించే తన ప్రణాళిక యూఎస్ వినియోగదారులపై పని చేయబోదన్నారు. విస్కాన్సిన్, మిచిగాన్ లతో పాటు మూడు రస్ట్ బెల్ట్ రాష్ట్రాల్లో పెన్సిల్వేనియా ఒకటి. 2016లో ట్రంప్ విజయం సాధించడానికి ఇది ఎంతో సహాయపడింది. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలు ఆయనను దెబ్బతీస్తాయని కొందరూ రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version