అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ భర్త డగ్లస్ ఎమ్‌హోఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు గతంలో వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆయన తాజాగా అంగీకరించారు. తన మొదటి వివాహం సమయంలో తాను వివాహేతర సంబంధం పెట్టుకుని తన మొదటి భార్యను మోసగించినట్లు చెప్పారు.
ఎమ్‌హోఫ్ తన పిల్లలు చదివే పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలితో వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని.. ఈ విషయమే ఆయన మొదటి వివాహానికి ముగింపు పలికిందని ఓ బ్రిటిష్ మీడియా పేర్కొనడంతో ఆయన స్పందించారు. తన మొదటి వివాహం తర్వాత తన చర్యలతో తాను, తన భార్య కెరిస్టిన్ చాలా కఠిన సమయాన్ని ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. దీనికి పూర్తి బాధ్యత వహించానని డగ్లస్ సీఎన్‌ఎన్‌తో ఇంటర్వ్యూలో తెలిపారు. కమలా హారిస్, హెమ్‌హోఫ్ 2014లో పెళ్లి చేసుకున్నారు. కమలా హారిస్‌కు ఇది మొదటి వివాహం కాగా.. హెమ్‌హోఫ్‌కు రెండోది. అతడి వివాహేతర సంబంధం గురించి హారిస్‌కు ముందే తెలుసని సీఎన్‌ఎన్ పేర్కొంది.