ఏదైనా అంశంపై తనదైన రీతిలో వ్యంగ్యంగా స్పందించడం వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు కొత్తేమీ కాదు. తాజాగా ఆయన అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయంపై స్పందిస్తూ.. ‘బుల్లెట్ హిట్ ట్రంప్ అండ్ కిల్డ్ కమలా’ అని రాసుకొచ్చారు. అనగా, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌కి ఎన్నికల ప్రచారంలో బుల్లెట్ తగిలితే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ మృతి చెందింది’ అని అర్థం వచ్చేలా రాసుకొచ్చారు.
ఆర్జీవీ ట్వీట్‌ను గమనిస్తే ట్రంప్‌ను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేసినట్లు అర్థం అవుతోంది. అమెరికా ఎన్నికల ప్రచారంలో తొలుత దూకుడుగా వ్యవహరించిన కమలా.. ఎప్పుడైతే ట్రంప్‌కు బుల్లెట్ గాయం అయ్యిందో నాటి నుంచి వెనుకబడుతూ వచ్చారు. అనుహ్యంగా ట్రంప్‌కు మైలేజ్ పెరిగింది. తొలి డిబేట్‌లో ట్రంప్‌ను కమలా ఓడించారు.దీంతో మరోసారి ఆమెతో డిబేట్ చేయనని ట్రంప్ ప్రకటించడంతో గెలుపు కమలాదే అని భావించారు. కానీ ట్రంప్‌పై హత్యాయత్నం జరగడం వల్ల జనాల్లో సింపతీ పెరిగి కమలా ఓటమి పాలైందని పరోక్షంగా ఆర్జీవీ స్పందించారు.