మరోసారి ఖలిస్థానీ సానుభూతిపరుల రెఫరెండం .. 2లక్షల మంది ఓటింగ్​!

-

ఖలిస్థాని ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత ఏర్పడింది. ఈ పరిస్థితులు రోజురోజుకు మరింత ముదురుతున్నాయి. ఈ ఉద్రిక్తత తీవ్ర రూపం దాల్చుతున్న వేళ ఖలిస్థానీ సానుభూతిపరులు చేసిన పని ఇప్పుడు మరింత చర్చనీయాంశమవుతోంది. ఖలీస్థానీ సానుభూతి పరులు మరోసారి రెఫరెండం నిర్వహించగా.. ఈ అనధికార ఓటింగ్‌లో వేల సంఖ్యలో ఖలిస్థానీ అనుకూలవాదులు పాల్గొన్నారు. దాదాపు 2 లక్షల మంది ఓటింగ్​లో పాల్గొన్నట్లు సమాచారం.

అమెరికాకు చెందిన సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ ఆధ్వర్యంలో రెఫరెండం నిర్వహించినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు గురైన గురుద్వారా వద్దే ఈ ఓటింగ్ నిర్వహించడం గమనార్హం. ఇందులో ఖలిస్థానీ మద్దతుదారులు పాల్గొన్నా అనేక మంది సిక్కులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిణామాలపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా. కెనడా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news