అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేటితో ముగిసింది. ఈ పర్యటనలో అమెరికాతో రక్షణ, టెక్నాలజీ రంగాల్లో భారత్ కీలక ఒప్పందాలు కుదుర్చుకోగా.. తన పర్యటన ద్వారా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక బంధం సరికొత్త మైలురాయిని చేరిందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్-అమెరికా భాగస్వామ్యం 21వ దశాబ్దంలో ప్రపంచ భవిష్యత్‌ను మార్చగలదని పేర్కొన్నారు. మోదీ అమెరికా పర్యటన ముగిసిన ఈ సందర్భంగా ఒక విమానం భారత ప్రధాని మోదీ, ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఫొటోలతో ఉన్న భారీ బ్యానర్‌తో న్యూయార్క్ గగనతలంలో విహరించింది.
మోదీ అమెరికాలో పర్యటించినందుకు గుర్తుగా ఇరుదేశాల నేతల చిత్రాలు ఆకాశంలో మెరిశాయి. దీనికి సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్విటర్‌లో పోస్టు చేశారు. అయితే, ఈ వీడియోను ఎప్పుడు రికార్డు చేశారో తెలియలేదు. ఈ పర్యటనలో భాగంగా రెండు దేశాల నడుమ అనేక ఒప్పందాలు జరిగాయి. ఇదిలా.. ఉండగా అమెరికా పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ ఈజిప్టు పర్యటన కోసం కైరోకు బయలుదేరివెళ్లారు.
Meanwhile in the sky of New York in United States of America 🇮🇳 pic.twitter.com/j7PcS8aHep
— Kiren Rijiju (@KirenRijiju) June 23, 2023