93 ఏళ్ల వయసులో ఐదోసారి వివాహమాడిన రూపర్ట్ మర్దోక్

-

అంతర్జాతీయ మీడియా దిగ్గజం రూపర్ట్‌ మర్దోక్‌ 93 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. తన కంటే వయసులో 25 ఏళ్లు చిన్నవారైన విశ్రాంత పరమాణు జీవశాస్త్రవేత్త ఎలీనా జుకోవాను వివాహమాడారు. ఇది రూపర్ట్కు ఐదో పెళ్లి. కాలిఫోర్నియాలోని సొంత ఎస్టేట్‌లో శనివారం వీరి వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ వివాహానికి అమెరికా ఫుట్‌బాల్‌ టీమ్‌ ‘న్యూ ఇంగ్లాండ్‌ పేట్రియాట్స్‌’ యజమాని రోబెర్ట్‌ క్రాఫ్ట్‌ (82), ఆయన సతీమణి డానా బ్లూమ్‌బెర్గ్‌ (50) హాజరయ్యారు.

రూపర్ట్ మర్దోక్ మొదట ఆస్ట్రేలియాకు చెందిన పాట్రిషియా బుకర్‌ను పెళ్లి చేసుకుని 1960ల్లో విడిపోయారు. ఆ తర్వాత జర్నలిస్ట్‌ అన్నా మరియా మన్‌, చైనా వ్యాపారవేత్త విన్‌డీ డెంగ్‌, అమెరికా మోడల్‌ జెర్రీ హాల్‌తో విడాకులు తీసుకున్నారు. ఆయనకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తన రెండో భార్య మన్‌ నుంచి విడిపోతున్నప్పుడు రూపర్ట్ మర్డాక్ ఆమెకు 1.7 బిలియన్‌ డాలర్ల ఆస్తిని భరణంగా చెల్లించినట్లు సమాచారం. ఇది అత్యంత ఖరీదైన భరణాల్లో ఒకటి.

Read more RELATED
Recommended to you

Latest news