బోడుప్పల్ కాలనీవాసులు..అంధకారంలో ఉన్నారు. నిన్న హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. బోడుప్పల్ ఏరియాలో నిన్న కురిసిన గాలివానకు విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాయంత్రం నుండి కరెంటు పోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డా.. అధికారులు ఎంత మాత్రం పట్టించుకోలేదు.

ఆ ప్రాంత ఏఈ సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పెట్టుకోవడం గమనార్హం. ఇక చివరికి చిర్రెత్తుకొచ్చిన ప్రజలు వర్షంలోనే ధర్నాకు దిగారు. ఇక అటు హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షాలు ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించింది. ఇవాళ సాయంత్రం 6 గంటల తరువాత పలు జిల్లాల్లో భారీ వర్షం ఉన్నట్లు ఐఎండీ వివరించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని…50-60కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడవచ్చని తెలిపింది ఐఎండీ.