‘గేట్స్’ ఫౌండేషన్‌కు మెలిండా రాజీనామా.. బాధగా ఉందన్న బిల్గేట్స్

-

‘బిల్ అండ్ మెలిండా గేట్స్’ ఫౌండేషన్ ఇక నుంచి గేట్స్ ఫౌండేషన్‌గా సేవలందించబోతోంది. బిల్ గేట్స్ మాజీ సతీమణి మెలిండా గేట్స్ ఆ ఫౌండేషన్ నుంచి వైదొలగడంతో ఈ పేరులో మార్పు వచ్చింది. 2021లో తన భర్తకు విడాకులిచ్చిన మెలిండా గేట్స్, ఇప్పుడు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించే తమ ఫౌండేషన్కు రాజీనామా చేసి ఆ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నారు. ఫౌండేషన్ నుంచి వైదొలగిన వేళ, భవిష్యత్తులో వ్యక్తిగతంగా సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఆమెకు రూ.లక్ష కోట్ల (12.5 బిలియన్ డాలర్లు) వాటా లభించింది.

ఈ సందర్భంగా మెలిండా ట్వీట్ చేస్తూ.. ”జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకురాలి పదవి నుంచి వైదొలగాలని నేను నిర్ణయించుకున్నాను. బిల్, నేను కలిసి ఈ ఫౌండేషన్‌ను నిర్మించి ఈ స్థాయికి తీసుకొచ్చాం. ఫౌండేషన్ చాలా బలంగా ఉంది. దానికి మంచి నాయకత్వం కూడా ఉంది. అందుకే నేను వైదొలిగేందుకు ఇదే సరైన సమయమని భావించాను.” అని మెలిండా గేట్స్ వెల్లడించారు.

తన మాజీ భార్య మెలిండా నిర్ణయంపై స్పందిస్తూ.. ”ఫౌండేషన్ నుంచి మెలిండా తప్పుకున్నందుకు నేను చింతిస్తున్నాను. కానీ ఆమె తన భవిష్యత్ దాతృత్వ పనిలో కచ్చితంగా సమాజంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తారని బలంగా నమ్ముతున్నాను” అని బిల్ గేట్స్  పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version