రష్యాలోని అంగారా ఎయిర్ లైన్స్ ప్యాసింజర్ విమానం కనిపించకుండా పోయింది. ATC నుంచి AN 24 ఎయిర్ క్రాఫ్ట్ కాంటాక్ట్ కట్ అయింది. ఆ సమయంలో విమానంలో 49 మంది ప్రయాణిస్తున్నారు. రష్యా – చైనా సరిహద్దులోని టిండా టౌన్ కు వెళ్తుండగా లాండింగ్ కు కొద్ది సమయం ముందు విమానం కనిపించకుండా పోయినట్టుగా సమాచారం అందుతుంది. దీనికి గల ప్రధాన కారణం ప్రతికూల వాతావరణమేనని అధికారులు భావిస్తున్నారు.

ప్రస్తుతం దీనికి సంబంధించి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. కాగా అదృశ్యమైన రష్యా విమానం చైనా సరిహద్దుల్లో కుప్పకూలిందని అంటున్నారు. ప్రమాద సమయంలో అందులో 43 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారట. రష్యాలోని అంగారా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం టిండా నగరానికి వెళ్తుండగా జరిగిన ఈ ఘటనలో అందరు మృతి చెందారని అంటున్నారు. కాగా దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.