ముంబై పేలుళ్ల కుట్ర‌దారుడు హ‌ఫీజ్ స‌యీద్‌కు 31 ఏళ్ల జైలు శిక్ష

-

ముంబై పేలుళ్ల కుట్ర‌దారుడు హఫీజ్ స‌యీద్ కు పాకిస్థాన్ ఉగ్ర‌వాద నిరోధ‌క కోర్టు షాక్ ఇచ్చింది. ఉగ్ర‌వాదుల‌కు నిధులు స‌మ‌కూర్చుతున్నారంటూ ఒక ఆరోప‌ణ ఉండేది. ఈ ఆరోప‌ణ నిజం అని పాకిస్థాన్ ఉడ్ర‌వాద నిరోధ‌క కోర్టు తెల్చింది. దీంతో హ‌ఫీజ్ స‌యీద్ కు ఏకంగా 31 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతే కాకుండా.. భారీ జ‌రిమానాను కూడా విధించింది. హ‌ఫీజ్ స‌యీద్.. పాకిస్థాన్ ఉగ్ర‌వాద నిరోధ‌క కోర్టు రూ. 3,40,000 ను జ‌రిమానా విధించింది.

కాగ హ‌ఫీజ్ స‌యీద్.. జ‌మాత్ ఉద్ ద‌వా అనే సంస్థ‌కు నాయ‌కుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. కాగ హ‌ఫీజ్ స‌యీద్ కు భార‌త్ అంటే.. విపరీతమైన కోపం ఉంటుంది. భార‌త్ లో బాంబు దాడులు చేయ‌డానికి అనేక ప్ర‌య‌త్నాలు చేశాడు. 2008 జ‌రిగిన ముంబై పేలుళ్ల కేసులో హ‌ఫీజ్ సయీద్ ప్ర‌ధాన కుట్ర‌దారుడుగా ఉన్నాడు. కాగ 2008 లో జ‌రిగిన ముంబై పెలుళ్ల‌ల్లో 166 మంది చ‌నిపోయారు. అలాగే వంద‌ల మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version