బిగ్ బ్రేకింగ్ : నెల్సన్‌ మండేలా చిన్న కుమార్తె మృతి..!

-

దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, నల్లజాతి సూరీడు నెల్సన్‌ మండేలా చిన్న కుమార్తె జిండ్జీ(59) సోమవారం మృతి చెందారు. ఈ రోజు ఉదయం జోహన్నెస్‌బర్గ్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో దక్షిణాఫ్రికాలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే ఆమె మరణానికి గల కారణాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. ప్రస్తుతం జిండ్జీ డెన్మార్క్‌ రాయబారిగా పని చేస్తున్నారు.

కాగా నెల్సన్‌ మండేలా- రెండో భార్య విన్నీ మడికిజెలాకు పుట్టిన సంతానం జిండ్జీ. నల్లజాతీయుల కోసం సుదీర్ఘ కాలం పాటు పోరాటం చేసిన వీరుడిగా గుర్తింపు పొందిన నెల్సన్ మండేలా శ్వాసకోశ సంబంధ రుగ్మతతో బాధపడుతూ 2013 డిసెంబర్ 5న జోహన్నెస్‌బర్గ్‌లో‌ కన్నుమూసిన సంగతి తెలిసిందే. నెల్సన్‌ మండేలాకు మొత్తం ముగ్గురు భార్యలు కాగా.. ఆరుగురు సంతానం. 20 మంది మనువలు, మనవరాళ్లు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news