న్యూజెర్సీలో అక్షర్‌ధామ్‌ ఆలయం ప్రారంభం.. భారత్‌ వెలుపల నిర్మించిన అతిపెద్ద కోవెల ఇదే

-

ఆధునిక యుగంలో భారత్‌ దేశం బయట నిర్మించిన అతి పెద్ద హిందూ దేవాలయ ప్రారంభోత్సవం ఆదివారం రోజున అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ దేవాలయాన్ని అమెరికాలోని న్యూజెర్సీ రాబిన్స్‌విల్లేలో నిర్మించారు. అక్షర్‌ధామ్‌ ఆలయంగా పిలుచుకునే ఈ కోవెలను ఆదివారం రోజున మహంత్‌ స్వామి మహరాజ్‌ సమక్షంలో భారీ వేడుక నిర్వహించి ప్రారంభించారు. ఈ ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించి.. ప్రారంభోత్సవం సందర్భంగా సెప్టెంబరు 30 నుంచి 9 రోజులపాటు ఉత్సవాలు నిర్వహించారు.

రాబిన్స్‌విల్లే టౌన్‌షిప్‌లో 2011లో ఈ నిర్మాణం ప్రారంభమైంది. 183 ఎకరాల్లో అక్షర్‌ధామ్‌ పేరుతో నిర్మితమైన ఈ ఆలయంలో మొత్తం 10 వేల విగ్రహాలు, శిల్పాలు ఉన్నట్లు అంచనా. ఒక ప్రధాన గర్భగుడి, 12 ఉపాలయాలు, 9 శిఖరాలతో పాటు భారీ గుమ్మటం ఈ అక్షర్‌ధామ్‌ ప్రత్యేకత. బ్రహ్మకుండ్‌ అనే పేరుతో ఏర్పాటు చేసిన సంప్రదాయ బావిలో ప్రపంచవ్యాప్తంగా 300 నదుల నుంచి సేకరించిన జలాలను కలిపినట్లు న్యూయార్క్‌ నగర మేయర్‌ కార్యాలయ ఉప కమిషనర్‌ (అంతర్జాతీయ వ్యవహారాలు) దిలీప్‌ చౌహాన్‌ తెలిపారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి విచ్చేస్తున్న హిందువులు, ఇతర మతస్థులు ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news