‘దీపావళికి సెలవు’ బిల్లుకు న్యూయార్క్ అసెంబ్లీ ఆమోదం

-

అమెరికాలోని న్యూయార్క్‌లో దీపావళి పండుగ రోజును సెలవు దినంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీపావళి రోజు పాఠశాలలకు సెలవుదినంగా ప్రకటించాలని ప్రవేశపెట్టిన బిల్లును న్యూయార్క్‌ అసెంబ్లీ, సెనెట్ తాజాగా ఆమోదించింది. ఈ విషయాన్ని మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ తెలిపారు. గవర్నర్‌ సంతకంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చనుందని చెప్పారు. బ్రూక్లీన్‌-క్వీన్స్‌ డే సెలవు స్థానంలో దీపావళిని చేర్చినట్లు తెలిపారు. భారత సంతతితో పాటు దీపావళి పండుగ చేసుకునే అన్నివర్గాలకే కాదు.. మొత్తం న్యూయార్క్‌కే విజయమని మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఇది అందరికీ ముందుగా వచ్చిన ‘శుభ్‌ దీపావళి’ అని మేయర్‌ ఆడమ్స్‌ ట్వీట్ చేశారు.

ఈ ఏడాది నుంచి న్యూయార్క్‌లోని పాఠశాలలకు దీపావళి పండుగ రోజు సెలవుగా ప్రకటిస్తారు. దక్షిణాసియా, ఇండో-కరేబియన్‌ సముదాయం రెండు దశాబ్దాలకుపైగా చేస్తున్న పోరాటానికి దక్కిన విజయమని.. న్యూయార్క్‌ అసెంబ్లీకి ఎన్నికైన తొలి ఇండో- అమెరికన్‌ జెన్నిఫర్‌ రాజ్‌కుమార్‌ సంతోషం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news