ఉత్తర కొరియాలోకి అమెరికా ‘అణు’ సబ్​మెరైన్.. మిసైల్స్​తో కిమ్ వార్నింగ్

-

ఉత్తర కొరియా మరోసారి మిస్సైల్ ప్రయోగం చేసింది. అమెరికాకు వార్నింగ్​గా రెండు స్వల్ప శ్రేణి క్షిపణులను ప్రయోగించాడు కిమ్ రాజ్యం. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన సబ్​మెరైన్​ను దక్షిణ కొరియాకు అమెరికా తరలించిన నేపథ్యంలో హెచ్చరికగా కిమ్ ఈ క్షిపణి ప్రయోగాలు చేసినట్లు సమాచారం. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్​యాంగ్​కు సమీపంలోని ఓ ప్రాంతం నుంచి ఈ క్షిపణులు దూసుకొచ్చాయని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కార్యాలయం తెలిపింది. ఇవాళ తెల్లవారుజామున 3.30 నుంచి 3.46 గంటల మధ్య క్షిపణులు ప్రయోగించారని తెలిపింది. మిసైళ్లు 550 కిలోమీటర్లు ప్రయాణించి కొరియా ద్వీపకల్పానికి తూర్పున సముద్ర జలాల్లో పడిపోయాయని వెల్లడించింది.

జపాన్, దక్షిణ కొరియాలు ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలను నిర్ధరించాయి. జపాన్ అధీనంలోని సముద్ర జలాలకు అవతల క్షిపణులు పడిపోయాయని ఆ దేశ సైన్యం తెలిపింది. ప్రస్తుతానికైతే దీని వల్ల సముద్రంలోని నౌకలకు నష్టం జరగలేదని వివరించింది. గగనతలంలో విమానాల రాకపోకలకు సైతం ఇబ్బంది లేదని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news