సీఈవో పదవి నుంచి చాట్​జీపీటీ క్రియేటర్ శామ్‌ ఆల్ట్‌మన్‌ తొలగింపు

-

టెక్నాలజీ రంగంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరినీ వెంటాడుతున్న భయం అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ). దీనివల్ల ఎన్ని లాభాలున్నాయో.. అంతకంటే రెట్టింపు ముప్పు ఉంది. ఇప్పుడు ఇదే విషయం ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇందులో ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పదాలు చాట్ జీపీటీ, చాట్ బాట్, డీప్​ఫేక్ వీడియోలు. అయితే చాట్​ జీపీటీని సృష్టించిన శామ్ ఆల్ట్​మన్​పై వేటు పడింది. ఆయణ్ను సీఈవో బాధ్యతల నుంచి తొలగిస్తూ ఓపెన్ ఏఐ నిర్ణయం తీసుకుంది. ఆయనపై నమ్మకాన్ని కోల్పోవడమే దీనికి కారణమని ఓపెన్ ఏఐ చెప్పుకొచ్చింది. అతడి స్థానంలో తాత్కాలికంగా కంపెనీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ మిరా మురాటీ సీఈవోగా వ్యవహరిస్తారని ప్రకటించింది. అయితే ఆల్ట్‌మన్‌ తొలగింపు నిర్ణయం ప్రస్తుతం టెక్‌ వర్గాల్లో సంచలనంగా మారింది.

ఆల్ట్‌మన్‌ బోర్డుతో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయతీ పాటించడం లేదని.. సరైన సమాచారం పంచుకోకపోవడం వల్ల అతడిపై నమ్మకం కోల్పోయామని ఓపెన్ ఏఐ ఓ ప్రకటనలో పేర్కొంది. అంతే కాకుండా బోర్డు నిర్ణయాలకు అడ్డు పడుతున్నట్లు తెలిపింది. తన తొలగింపుపై ఆల్ట్​మన్ స్పందిస్తూ ఓపెన్​ఏఐలో పని చేయడాన్ని తాను ఎంతో ఇష్టపడ్డానని చెప్పారు. అక్కడ ఎంతో మంది ప్రతిభావంతులతో పనిచేసే అవకాశం లభించిందని ఎక్స్ వేదికగా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news