తీరు మార్చుకోని శత్రు దేశం పాకిస్థాన్ బార్డర్ లో రెచ్చిపోయింది. మళ్లీ పాక్ బలగాలు కాల్పులు జరిపాయి. వరుసగా ఎనిమిదో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్… మళ్లీ కాల్పులు జరిపింది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, నౌషెరా, అక్నూర్ సెక్టార్‌లలో LOC వెంబడి పాక్ బలగాల కాల్పులు జరిపింది.

పాక్ కాల్పులను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఇండియన్ ఆర్మీ.. రివర్స్ ఎటాక్ చేసింది. కాగా, పాకిస్థాన్ ఐఎస్ఐ ఇన్ఫార్మర్ పఠాన్ ఖాన్ అరెస్ట్ అయ్యాడు. పాకిస్థాన్ ఐఎస్ఐ తరపున గూఢచర్యం చేస్తున్నందుకు జైసల్మేర్ నివాసి పఠాన్ ఖాన్ అరెస్ట్ అయ్యాడు. పఠాన్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు రాజస్థాన్ ఇంటెలిజెన్స్. ఖాన్‌పై అధికారిక రహస్యాల చట్టం 1923 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఖాన్‌ను దాదాపు నెల క్రితం అదుపులోకి తీసుకుని అప్పటి నుంచి ప్రశ్నిస్తున్నారు ఇంటెలిజెన్స్.