వేసవికాలంలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎండలు వలన శరీరం మాత్రమే కాకుండా కంటి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఎప్పుడైతే అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయో, వేడి గాలులు వలన కళ్ళు మండడం, పొడిబారడం వంటివి జరుగుతాయి. అంతేకాకుండా, ఇటువంటి సమస్యలు వలన చూపు మందగించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. వేసవికాలంలో మంచి నీటిని తాగడం లేక ఇతర పానీయాలను తీసుకోవడంతో పాటుగా, కంటి ఆరోగ్యం గురించి కూడా కొంత జాగ్రత్త వహించాలి.
ఆరోగ్యంగా ఉండాలంటే ఎండలో బయటకు వెళ్లకుండా ఉండడం మరియు వెళ్లాల్సిన సమయంలో సరైన జాగ్రత్తలను తీసుకొని వెళ్లడం వంటివి చేయాలి. ఎప్పుడైతే ఎండ ఎక్కువగా ఉంటుందో శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. ఈ విధంగా కళ్ళలో కూడా తేమ పూర్తిగా తగ్గిపోతుంది, దీంతో కళ్ళు పొడిబారతాయి. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఎక్కువ సూర్యకాంతి కూడా ఎంతో ఉంటుంది. దీంతో కళ్ళకు ఎంతో ఇబ్బంది వస్తుందిఎండాకాలంలో వైరస్ మరియు బ్యాక్టీరియాకు సంబంధించిన కంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక తగిన చర్యలను తీసుకోవాలి.
కంటి ఆరోగ్యాన్ని ఎండ నుండి కాపాడుకోవాలంటే, వేసవికాలంలో రోజ్ వాటర్ తో ముఖం మరియు కళ్ళను కడుక్కోవడం ఎంతో అవసరం. అంతేకాకుండా రాత్రి నానబెట్టిన త్రిఫల పొడిని ఉపయోగించి ఉదయాన్నే కళ్ళను కడుక్కోవడానికి ఉపయోగించాలి. ఇలా చేస్తే కళ్ళు పొడిబారకుండా ఉంటాయి. ఎప్పుడైతే వేసవికాలంలో కళ్ళు ఎర్రబడతాయో మరియు పొడిబారతాయో కలబంద గుజ్జును తీసుకుని కంటి దగ్గర రాసుకోవడం వలన ఎంతో ఉపయోగం ఉంటుంది. ఎండాకాలంలో బయటకు వెళ్లి వచ్చిన తర్వాత చల్లని కీరదోసకాయ ముక్కలు కంటి మీద పెట్టుకుంటే ఎంతో హాయిగా మరియు చల్లగా ఉంటుంది. కనుక వేడి నుంచి కళ్ళను కాపాడుకోవాలంటే ఈ చిట్కాలను కచ్చితంగా ప్రయత్నిచండి.