పహల్గాం ఉగ్రవాదులు గురించి షాకింగ్ నిజం బయటపడింది. ఇంకా భారత్‌లోనే పహల్గాం ఉగ్రవాదులు ఉన్నారు. ఉగ్రదాడి అనంతరం దక్షిణ కాశ్మీర్‌లోని దట్టమైన అడవుల్లోకి వెళ్లి దాక్కున్నారని తెలిపింది ఓ దర్యాప్తు సంస్థ. ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ పరికరాలను వాడి ఉగ్రవాదులు తప్పించుకుంటున్నారని తెలిపింది ఎన్ఐఏ.

ఇక అటు పాకిస్థాన్ ఐఎస్ఐ ఇన్ఫార్మర్ పఠాన్ ఖాన్ అరెస్ట్ అయ్యాడు. పాకిస్థాన్ ఐఎస్ఐ తరపున గూఢచర్యం చేస్తున్నందుకు జైసల్మేర్ నివాసి పఠాన్ ఖాన్ అరెస్ట్ అయ్యాడు. పఠాన్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు రాజస్థాన్ ఇంటెలిజెన్స్. ఖాన్‌పై అధికారిక రహస్యాల చట్టం 1923 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఖాన్‌ను దాదాపు నెల క్రితం అదుపులోకి తీసుకుని అప్పటి నుంచి ప్రశ్నిస్తున్నారు ఇంటెలిజెన్స్.