దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి ఉగ్రదాడికి గురైంది. పాకిస్తాన్ లోని షెషావర్ నగరంలోని భారీ బాంబు పేలుడు జరిగింది. నగరంలోని కొచా రిసల్దార్ మసీదులో భారీ బాంబు పేలుడు కారణంగా దాదాపు 30 మంది దుర్మరణం పాలయ్యారు. కనీసం మరో 50 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
శుక్రవారం ప్రార్థన సమయంలో మసీదులో ఎక్కువ మంది ఉండగా.. ఈ పేలుడు సంభవించింది. దీంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు 30 మంది మృతదేహాలను లేడీ రీడింగ్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్జితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రాథమికి నివేదిక ప్రకారం… ఇద్దరు దుండగులు నగరంలోని కిస్సా ఖ్వానీ జజార్లోని మసీదులోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని.. కాపలాగా ఉన్న పోలీసులపై కాల్పులు జరిపారని క్యాపిటల్ సిటీ పోలీస్ ఆఫీసర్ (CCPO) పెషావర్ ఇజాజ్ అహ్సన్ వెల్లడించారు. ఇందులో ఒకరు పోలీస్ చనిపోగా.. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారని పేర్కొన్నాడు. ఈ ఘటన తర్వాత మసీదులో పెద్దగా పేలుడు సంభవించినట్లు తెలిపారు. మసీదు ఉన్న ప్రాంతం మార్కెట్ ప్రాంతం కావడంతో శుక్రవారం ప్రార్థనలకు భారీ స్థాయిలో స్థానికలు వచ్చారని తెలుస్తోంది. ఈ సమయంలోనే పేలుడు సంభవించింది. ఇదిలా ఉంటే ఈ ఘటనకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యులుగా ప్రకటించుకోలేదు.