యుద్ధానికిది సమయం కాదు : ప్రధాని మోదీ

-

యుద్ధానికిది సమయం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడైనా అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అంగీకార యోగ్యం కాదని తేల్చి చెప్పారు. ఆస్ట్రియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఛాన్సలర్‌ కార్ల్‌ నెహమ్మర్‌తో పలు అంశాలపై చర్చలు జరిపారు. రానున్న దశాబ్దంలో పరస్పరం సహకరించుకోవడానికి బ్లూప్రింట్‌ను సిద్ధం చేశారు.

చర్చలు, దౌత్యం ద్వారా సత్వర శాంతి స్థాపనకు భారత్, ఆస్ట్రియా ప్రయత్నిస్తాయని మోదీ తెలిపారు. ఈ లక్ష్య సాధనకు గల అన్ని అవకాశాలను వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. భారత్, ఆస్ట్రియా బంధానికి 75ఏళ్లయిన సందర్భంగా తాను రావడం గొప్ప విషయమని ప్రధాని వ్యాఖ్యానించారు.

భేటీ అనంతరం రెండు దేశాల అధినేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దాదాపు 40ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం ఇదే ప్రథమం. ‘ఆస్ట్రియా ఛాన్సలర్‌తో ఫలవంతమైన చర్చలు జరిగాయి. ప్రపంచంలోని ప్రస్తుత ఘర్షణలపై మేమిద్దరం చర్చించాం. పశ్చిమాసియాలో ఘర్షణలు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మా మధ్య చర్చకు వచ్చాయి. యుద్ధ భూమిలో సమస్యలు పరిష్కారం కాబోవని తెలిపాను’ అని ప్రధాని మోదీ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news