నాతో గోల్ఫ్ ఆడండి గెలిస్తే మిలియన్ డాలర్లు!.. బైడెన్ కు ట్రంప్ సవాల్

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో దూకుడుగా దూసుకుపోతున్న మాజీ, ప్రస్తుత అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌, జో బైడెన్‌ సవాళ్లు విసురుతూ అగ్రరాజ్య ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న ట్రంప్‌, తన ప్రత్యర్థి, డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు మరో సవాల్‌ విసిరారు. తనతో గోల్ఫ్ ఆడడానికి సిద్ధమా అంటూ ఫ్లోరిడాలో నిర్వహించిన సభలో ఛాలెంజ్ చేశారు.

తనతో గోల్ఫ్‌ ఆడేందుకు రావాలంటూ 81 ఏళ్ల బైడెన్‌కు 78 ఏళ్ల ట్రంప్‌ సవాల్‌ విసిరారు. గోల్ఫ్ మ్యాచ్‌ను అధికారికంగా సవాలు చేస్తున్నానని, బైడెన్‌ గెలిస్తే ఆయన చెప్పిన స్వచ్ఛంద సంస్థకు ఒక మిలియన్‌ డాలర్లు విరాళం ఇస్తానని ట్రంప్‌ ప్రకటించారు.  మ్యాచ్ ఎక్కడ జరగాలో మీరు చెప్పాలని బైడెన్‌కు ట్రంప్‌ సవాల్‌ విసిరారు.

అయితే ఈ సవాల్‌ను బైడెన్‌ సన్నిహిత వర్గాలు తోసిపుచ్చాయి. ట్రంప్‌ విచిత్రమైన చేష్టలకు సమాధానం చెప్పే సమయం బైడెన్‌కు లేదని తెలిపాయి. బైడెన్‌ అమెరికాను నడిపించడంలో, స్వేచ్ఛా ప్రపంచాన్ని రక్షించడంలో బిజీగా ఉన్నారని, ఈ ఆటలకు ఖాళీగా లేరన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news