పాక్‌లో ముదిరిన రాజ‌కీయ సంక్షోభం.. రేపు ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ రాజీనామా..!

-

పాకిస్థాన్ లో రాజ‌కీయ సంక్షోభం ముదిరింది. పాక్ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు సొంత పార్టీ ప్ర‌జా ప్ర‌తినిధులు, నాయ‌కుల నుంచే వ్య‌తిరేక‌త వ‌స్తుంది. అంతే కాకుండా పాక్ ఆర్మీ నుంచి కూడా రాజీనామా చేయాల‌నే ఒత్తిడి వ‌స్తుంది. దీనికి తోడు పాక్ లోని ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానాన్ని కూడా ఇచ్చారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ త‌న ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. రేపు పాకిస్థాన్ రాజ‌ధాని ఇస్లామాబాద్ లో ఇమ్రాన్ ఖాన్.. భారీ ర్యాలీ నిర్వ‌హించబోతున్నారు.

ఈ ర్యాలీలోనే త‌న ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వికి ఇమ్రాన్ ఖాన్ రాజీనామా ప్ర‌క‌టించే అవకాశం ఉంద‌ని స‌మాచారం. అలాగే ఇదే ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్.. త‌మ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి.. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డంపై కూడా ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. అయితే పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ను విదేశీ నిధుల కేసులో సోమ‌వారం అరెస్టు చేసే సూచ‌న‌లు కూడా క‌నిపిస్తున్నాయి.

కాగ‌ పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్.. ఆర్మీలో విశ్వాసం కోల్పోయారు. సోషల్ మీడియా ద్వారా పాక్ ఆర్మీలో చీల‌క తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నించిన‌ట్టు వార్తలు వ‌స్తున్నాయి. అందుకే పాక్ ఆర్మీతో పాటు సొంత పార్టీ నేత‌లు కూడా ఇమ్రాన్ ఖాన్ కు వ్య‌తిరేకంగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version