బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో విజేతగా నిలిచిన లేబర్‌పార్టీ అభ్యర్థి కైర్ స్టార్మర్ కు ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖతాలో ఒక పోస్ట్ పెట్టారు. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం యూకేతో కలిసి నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆ పోస్టులో పేర్కొన్నారు. యూకే సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కైర్ స్టార్మర్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని తెలిపారు భారత ప్రధాని మోడీ.
యూకేతో పరస్పర వృద్ధిని, శ్రేయస్సును పెంపొందించే అన్ని రంగాల్లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వా్మ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు మేము సానూకూల, నిర్మాణాత్మక సహకారం కోసం ఎదురు చూస్తున్నాం’ అని మోడీ తన ఎక్స్ పోస్టులో రాశారు. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలైంది. ప్రధాని రిషీ సునక్ ఘోరంగా ఓడిపోయారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ దాదాపు 14 ఏళ్ల విరామం తర్వాత తిరిగి అధికారంలో వచ్చింది. ఆ పార్టీ అభ్యర్థి కైర్ స్టార్మర్ బ్రిటన్‌కు నూతన ప్రధాని కాబోతున్నారు.