ఓటమికి బాధ్యత వహిస్తున్నా.. గెలిచి ఓడిన రిషి సునాక్

-

బ్రిటన్ పార్లమెంట్‌ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించగా.. కన్జర్వేటివ్‌ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేత, భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్‌ ఓటమిని అంగీకరించారు. దీనికి బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన స్థానం రిచ్‌మండ్స్‌ నుంచి ప్రత్యర్థిపై మరోసారి విజయం సాధించారు. కానీ సునాక్ కేబినెట్ మంత్రులైన గ్రాంట్ షాప్స్, అలెక్స్ చాల్క్ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు.

మరోవైపు రిచ్‌మండ్‌ అండ్‌ నార్తర్న్ అలర్టన్‌లోని తన మద్దతుదారుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీని విజయం వరించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత కీర్‌ స్టార్మర్‌ అభినందనలు తెలియజేస్తున్నాను. అధికారం శాంతియుతంగా చేతులు మారుతుంది. అది మన దేశ భవిష్యత్తు, స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుంది’’ అని సునాక్‌ అన్నారు. ఈ సందర్భంగా తన మద్దతుదారులను క్షమించమని రిషి సునాక్‌ కోరారు. ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news