ఖలిస్థాన్ నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్ను హత్యకు కుట్ర పన్నారని అమెరికా చేసిన ఆరోపణల విషయంలో భారత్‌ను రష్యా వెనకేసుకొచ్చింది. ఈ కేసులో భారత పౌరుల ప్రమేయానికి సంబంధించి అగ్రరాజ్యం ఎలాంటి ఆధారాలు అందించలేదని పేర్కొంది. సరైన ఆధారాలు లేకుండా ఊహాగానాలు చేయడం…. ఆమోద యోగ్యం కాదని అని వ్యాఖ్యానించింది.
జాతీయ భావనలను, భారత్ అభివృద్ధి చరిత్రను . అమెరికా అర్థం చేసుకోలేదు. అమెరికా ఆరోపణలు భారతదేశాన్ని అగౌరవపరచడమే. అని రష్యా విదేశాంగశాఖ అధికారిక ప్రతినిధి మరియా జాఖరోవా అన్నారు. రష్యా, సౌదీ అరేబియాల మాదిరిగానే భారత్ కూడా తమ శత్రువులపై చర్యలు తీసుకుంటోందని ‘ది వాషింగ్టన్ పోస్ట్’ ప్రచురించిన కథనంపై అడిగిన ప్రశ్నకు మరియా ఈ మేరకు సమాధానం ఇచ్చారు. రష్యా అణచివేత పాలన సాగిస్తోందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొనడంపై ఆమె ఫైర్ అయ్యారు. అమెరికా కంటే ఎక్కువగా. అణచివేత పాలన ఎవరూ సాగించడంలేదని మరియా ఆరోపించారు.