చావుదెబ్బ కొట్టిన రష్యా.. 234 మంది ఉక్రెయిన్ ఫైటర్లను హతమార్చిన క్రెమ్లిన్

-

ఉక్రెయిన్పై రష్యా చావుదెబ్బ కొట్టింది. తమ దేశ సరిహద్దుల్లోకి చొరబాటుకు యత్నించిన 234 మంది ఫైటర్లను హతమార్చింది. ఈ విషయాన్ని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. రష్యా భద్రత బలగాలు ఉక్రెయిన్ ఫైటర్ల చొరబాట్లను సమర్థంగా తిప్పికొట్టాయని పేర్కొంది. రష్యా సైన్యం, సరిహద్దు దళాలు దేశ భూభాగంలోకి వచ్చి దాడులకు పాల్పడిన ఉక్రెయిన్ ఫైటర్లను ఆపగలిగాయని తెలిపింది. ఉక్రెయిన్ ఫైటర్ల దాడులను నివారించగలిగాయని వెల్లడించింది. ఉక్రెయిన్ ఫైటర్ల ఏడు యుద్ధ ట్యాంకులు, ఐదు సాయుధ వాహనాలను నాశనం చేశామని ఈ సందర్భంగా రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

రష్యా అధ్యక్ష ఎన్నికలకు కొద్ది రోజుల ముందు దేశ సరిహద్దుల్లో ఉక్రెయిన్ ఫైటర్లు ఇలాంటి దాడులకు పాల్పడడం క్రెమ్లిన్ను కలవరపెడుతున్నట్లు సమాచారం. మంగళవారం రోజున రష్యాపై ఉక్రెయిన్‌ దీర్ఘశ్రేణి డ్రోన్లతో విరుచుకుపడగా ఈ దాడిలో రెండు చమురు శుద్ధి క్షేత్రాలను డ్రోన్లు తాకాయి. తమ దేశంలోని ఎనిమిది ప్రాంతాల్లో డ్రోన్లు పడ్డాయని రష్యా అధికారులు తెలిపారు. మాస్కోపైకి దూసుకొచ్చిన డ్రోన్‌ను కూల్చివేసినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news