రష్యా రివెంజ్.. జెలెన్‌స్కీ స్వస్థలంపై బాంబుల వర్షం

-

ఉక్రెయిన్ పై రష్యా మరోసారి తన రివెంజ్ తీర్చుకుంది. ఇటీవల మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేసిన విషయం తెలిసిందే.  ఉక్రెయిన్‌ ఎదురుదాడులను నిర్వీర్యం చేసే క్రమంలో క్షిపణి దాడులను రష్యా ఉద్ధృతం చేసింది. సోమవారం ఏకంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వస్థలం క్రివి రిహ్‌పై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో ఆరుగురు మరణించగా 75 మంది గాయపడ్డారు. చనిపోయినవారిలో పదేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.

ఓ అపార్ట్‌మెంటులో నాలుగు, తొమ్మిది అంతస్తుల మధ్య ప్రాంతంపై క్షిపణి పడింది. మరో నాలుగు అంతస్తుల విశ్వవిద్యాలయ భవనాన్ని కూడా రష్యా కూల్చేసింది. పౌర నివాసాలపై దాడి చేయకూడదనే సంప్రదాయం ఉన్నా, దాన్ని ఉల్లంఘించిన రష్యా.. అపార్ట్‌మెంట్లపై విరుచుకుపడుతోందని ఉక్రెయిన్‌ అంతరంగిక మంత్రి ఆరోపించారు. మరోవైపు రష్యానేమో.. ఉక్రెయిన్‌ సైనిక స్థావరాలపైనే తాము దాడులు చేస్తున్నట్లు చెబుతోంది. ఉక్రెయిన్‌ సైన్యంలోని అశక్తత రోజురోజుకూ బయటపడుతోందని.. నాటో కూటమి ఇచ్చిన ఆధునిక ఆయుధాలను కూడా వారు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారని అని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version