మంచు విష్ణు కీలక నిర్ణయం.. వచ్చే ‘మా’ ఎన్నికలకు దూరం

-

మా అసోసియేషన్ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని అయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. రీసెంట్​గా జరిగిన మా సర్వసభ్య సమావేశంలో విష్ణు తన నిర్ణయాన్ని సభ్యులకు వివరించినట్లు తెలిసింది.

సెప్టెంబర్​లో మా ఎన్నికలు జరగాల్సి ఉండగా.. అసోసియేషన్​లో ఆడిట్ సమస్యల కారణంగా ఎన్నికలను మే లో నిర్వహించాలని అసోసియేషన్ సభ్యులు తీర్మానించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లోపు సభ్యులకు ఇచ్చిన హామీలను పూర్తి చేయాలని.. మా అధ్యక్షుడు విష్ణు భావిస్తున్నట్లు సమాచారం.

మంచు విష్ణు 2021లో జరిగిన ‘మా’ ఎన్నికల్లో.. సీనియర్ నటుడు ప్రకాశ్​రాజ్​పై 109 ఓట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడిగా హీరో శ్రీకాంత్, ట్రెజరర్​గా శివబాలాజీ గెలుపొందారు. అప్పట్లో మా అధ్యక్షుడి ఎన్నిక.. సాధారణ ఎన్నికలను తలపించాయి. నటుడు ప్రకాశ్​ రాజ్​కు మెగా ఫ్యామిలీ సైతం మద్ధతుగా నిలిచింది. కాగా మరోవైపు కుమారుడి గెలుపు కోసం హీరో మోహన్​బాబు స్వయంగా రంగంలోకి దిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version