‘ భారత్ విదేశాంగ విధానం భేష్’.. మోదీపై పుతిన్ ప్రశంసలు

-

ప్రధాని మోదీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు కురిపించారు. మోదీ నేతృత్వంలో భారత్​ స్వతంత్ర విదేశాంగ విధానం అవలంబిస్తోందని కొనియాడారు. ఆయన నాయకత్వంలో ఆర్థికంగానూ దేశం కీలక పురోగతి సాధించిందని కితాబిచ్చారు. మోదీని దేశభక్తుడిగా అభివర్ణించారు పుతిన్. మాస్కోలో గురువారం వాల్డాయ్​ డిస్కషన్​ క్లబ్ అనే ఓ సంస్థను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు పుతిన్.

“ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్నో పనులు జరిగాయి. ఆయన దేశభక్తుడు. మోదీ చేపట్టిన ‘మేక్​ ఇన్​ ఇండియా’ ఆర్థికంగా, నైతిక విలువల పరంగా ఎంతో గొప్పది. భవిష్యత్.. భారత్​దే. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అయినందుకు భారత్ గర్వపడొచ్చు. బ్రిటిష్ వలస దేశం నుంచి ఆధునిక దేశంగా భారత్ అపారమైన అభివృద్ధి సాధించింది. దాదాపు 150కోట్ల జనాభా, స్పష్టమైన అభివృద్ధి ఫలాలు.. భారత్​ను అందరూ గౌరవించేందుకు, అభిమానించేందుకు కారణాలు” అని అన్నారు పుతిన్. భారత్​, రష్యా బంధం ఎంతో ప్రత్యేకమైందని చెప్పారు పుతిన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version