ట్రంప్‌పై దాడి.. పోలీసులను బాధ్యులను చేసేందుకు సీక్రెట్‌ సర్వీస్‌ యత్నం

-

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై దాడి జరగడానికి స్థానిక పోలీసుల వైఖరే కారణమని సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెన్సీ అంటోంది. థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ పైకప్పు ఎక్కి గన్‌ పొజిషన్‌ తీసుకొన్నా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తోంది. ట్రంప్‌ రక్షణకు సంబంధించి తమ పరిధి దూరానికి మించి అది ఉందని.. సమావేశం జరిగిన ఏజీఆర్‌ ఇంటర్నేషనల్‌ ఐఎన్‌సీ ఫ్యాక్టరీ గ్రౌండ్స్‌ను పెట్రోలింగ్‌ చేయాల్సిన బాధ్యత స్థానిక పోలీసులదే అని పేర్కొంది.

నిందితుడు థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ 130 మీటర్ల దూరం నుంచి ట్రంప్‌పై కాల్పులు జరిపాడని.. అంత దూరంలో రక్షణ బాధ్యత స్థానిక పోలీసులదే అని సీక్రెట్‌ సర్వీస్‌ ఆంటోనీ గుగ్లెమీ వెల్లడించినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. ట్రంప్‌ ర్యాలీ జరిగే గ్రౌండ్స్‌ను మాత్రం సీక్రెట్‌ సర్వీస్‌ చూస్తుందని తెలిపారు. మరోవైపు స్థానిక పోలీసుల వైఫల్యాన్ని వెల్లడించేలా స్థానికుల వాంగ్మూలాలు కూడా ఉండటం గమనార్హం. ఇంకోవైపు వైపు గన్‌మెన్‌ పైకప్పు ఎక్కుతున్న వేళ ట్రంప్‌ అభిమాని ఒకరు భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసినా పట్టించుకోలేదని నిన్న తేలిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news