హెచ్‌ఐవీ ఉన్నా 200 మందితో సెక్స్‌ వర్కర్‌ శృంగారం.. అరెస్టు చేసిన పోలీసులు

-

ఓ సెక్స్‌ వర్కర్‌ వందల మందిూప్ప్రాణాలకు ముప్పు తలపెట్టింది. అమెరికాలోని ఒహైయో రాష్ట్రంలో ఓ సెక్స్ వర్కర్.. తనకు హెచ్‌ఐవీ పాజిటివ్‌ అని తెలిసినా.. అనేక మందితో లైంగిక సంబంధం ఏర్పరుచుకోవడంతో ఈ విషయం తెలిసి అధికారులు కంగుతున్నారు. స్థానికులను అప్రమత్తం చేసి.. ఆమెతో శృంగారంలో పాల్గొన్న వారు తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తూ హెల్త్‌ అలర్ట్‌ జారీ చేశారు. సదరు మహిళను అరెస్టు చేశారు.

ఒహైయోలోని మరియెట్టాకు చెందిన లిండా లెచెసే ఓ సెక్స్‌ వర్కర్‌. అక్కడి మార్కెట్‌ వీధిలో అనేక మందిని ఆకర్షిస్తుండేది. 2022లో జనవరి నుంచి ఇప్పటివరకు అనేక మందితో లైంగిక సంబంధం కొనసాగించింది. ఇదే సమయంలో ఆమె హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. అయినా సరే లిండా తన కార్యకలాపాలను కొనసాగించింది. రెండున్నరేళ్లలో దాదాపు 211 మందితో ఆమె సన్నిహితంగా మెలిగినట్లు అధికారులు గుర్తించారు. ఆమె క్లయింట్లకు వ్యక్తిగతంగా ఫోన్లు చేస్తూ.. మిగతా ఎవరైనా ఉంటే తమకు తెలియజేయాలని సూచిస్తున్నామని వాషింగ్టన్‌ కౌంటీ షెరీఫ్‌ కార్యాలయ అధికారులు, మెరియెట్టా పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version