అమెజాన్ కు షాక్.. రూ. 9.6 వేల‌ కోట్ల భారీ జ‌రిమానా

-

ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ కు భారీ షాక్ త‌గిలింది. ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ కు ఇటలీ దేశాని కి చెందిన కాంపిటీష‌న్ అథారిటీ భారీ జ‌రిమానా విధించింది. త‌మ దేశం లో ఉన్న నిబంధ‌న‌ల ను పాటించ‌లేద‌ని ఏకం గా రూ. 9.6 వేల కోట్ల ( 1.28 బిలియ‌న్ డాల‌ర్లు) భారీ జ‌రిమానా ను విధించింది. అమెజాన్ కంపెనీ త‌న వేర్ హౌస్.. డెలివ‌రీ సిస్ట‌మ్ ల‌ను ఉప‌యోగించి థర్డ్ పార్టీ వారికి అమెజాన్ ప్ర‌త్యేక మైన సేవ‌లు అందించింద‌ని కాంపిటీష‌న్ అథారిటీ ఆరోపించింది.

అమెజాన్ తీసుకున్న ఈ నిర్ణ‌యం వ‌ల్ల ఇత‌ర విక్ర‌య‌దారుల కు తీవ్రం గా న‌ష్టం వ‌చ్చింద‌ని చెబుతుంది. అమెజాన్ సేవ‌లు థ‌ర్డ్ పార్టీ కి సంబంధం లేకుండా నేరు గా విక్ర‌యించాల‌ని ఆదేశించింది. అలాగే దీనిలో ఎలాంటి వివ‌క్ష లేకుండా ఉండాల‌ని సూచించింది. అయితే అమెజాన్ కు విధించిన జ‌రిమానా భ‌రిస్తుందా లేదా.. అనేది ట్ర‌స్టీ ప‌ర్య‌వేక్షిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news