మహారాష్ట్రలో ఓమిక్రాన్ కల్లోలం.. దేశంలో 32కు చేరిన ఓమిక్రాన్ కేసులు..

-

ఇండియాలో ఓమిక్రాన్ కల్లోలం కొనసాగుతోంది. ఒక్క రోజులోనే కొత్తగా 9 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఓమిక్రాన్ కేసుల కౌంట్ 32కు చేరింది. ఓమిక్రాన్ కరోనా వేరియంట్ పట్ల ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయినా.. కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం దేశంలో వచ్చిన ఓమిక్రాన్ కేసులన్నీ దక్షిణాఫ్రికా, టాంజానియా, జింబాబ్వే నుంచి వచ్చిన వారికే సోకాయి.

మరోవైపు మహారాష్ట్రలో ఓమిక్రాన్ కేసులు కల్లోలం కలిగిస్తున్నాయి. దేశంలో ఇప్పటి వరకు మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ 5 రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో ఓమిక్రాన్ కల్లోలం మొదలైనట్లుగా కనిపిస్తోంది. మొత్తం 32 కేసుల్లో 17 కేసులు ఈ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. ఈరోజు కొత్తగా ఏడు కేసులు నమోదవ్వడం కలవరాన్ని కలిగిస్తుంది. ముంబైలో 3, పింప్రి చించ్వాడ్ లో 4 కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇదిలా ఉంటే ఓమిక్రాన్ సోకిన వారికి స్వల్ప లక్షణాలే ఉండటం కొత్త ఉపశమనం కలిగించే అంశం. ఇప్పటికే ఇద్దరు ఓమిక్రాన్ వేరియంట్ కరోనా బారి నుంచి బయటపడటం ఊరట కలిగించే విషయం.

Read more RELATED
Recommended to you

Latest news