రష్యా వ్యాక్సిన్‌తో జ‌ర‌ జాగ్ర‌త్త..! కార‌ణం ఇదే..!

-

క‌రోనా మ‌హ‌మ్మారిని అంతం చేయ‌డానికి ర‌ష్యా అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌తో జ‌ర జాగ్ర‌త్త‌..! ఎందుకంటే.. ఈ వ్యాక్సిన్‌‌ భద్రతపై అనేక‌ అనుమానాలు నెలకొ న్నాయి. ట్ర‌య‌ల్స్‌లో భాగంగా టీకా డోసులు తీసుకున్న ప్రతీ ఏడుగురు వలంటీర్లలో ఒకరికి సైడ్‌ ఎఫెక్ట్‌ వచ్చినట్టుగా స్వ‌యంగా రష్యా ఆరోగ్య శాఖనే చెప్పింది. మూడో దశ ప్రయోగాల్లో భాగంగా 40 వేల మందికి టీకా డోసులు ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. వారిలో ఇప్పటివరకు 300 మందికి వ్యాక్సిన్‌ ఇస్తే వారిలో 14 శాతం మందిలో సైడ్‌ ఎఫెక్ట్ క‌నిపించ‌డంతో ఆందోళ‌న‌లు నెల‌కొంటున్నాయి. అయితే.. ఈ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న వారిలో 14శాతం మందికి నీరసం, కండరాల నొప్పులు వంటివి వచ్చాయని, జ్వరం కూడా ఎక్కువగానే వచ్చినట్టుగా ర‌ష్యా ప్ర‌భుత్వం తెలిపింది.

21 రోజుల తర్వాత వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి రెండో డోసు టీకా ఇస్తామని పేర్కొంది. స్పుత్నిక్‌ వీ కరోనా వ్యాక్సిన్‌ మూడో దశ ప్రయోగాలు ఇంకా పూర్తి కాకముందే రష్యా ప్రభుత్వం వ్యాక్సిన్‌ని హడావుడిగా మార్కెట్‌లో విడుదల చేయ‌డంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వ్యాక్సిన్ మంచీచెడు ఆలోచించ‌కుండానే.. ప్రపంచంలోనే మొదటి వ్యాక్సిన్‌ తెచ్చిన దేశంగా నిలవాలన్న దురుద్దేశంతో త్వరితగతిన అనుమతులు మంజూరు చేయ‌డం స‌రికాద‌ని శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు. భారత్‌కి కోటి డోసులు ఇవ్వడానికి డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌తో రష్యా ఒప్పందం కుదుర్చుకున్న విష‌యం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news