39 మంది భార్యలు.. 94 మంది పిల్లలు.. అందరూ కలిసి ఒకే ఇంట్లో?

సాధారణంగా కుటుంబం అంటే, నలుగురు లేదా ఐదుగురు ఉంటారు. ఒక వేళ ఉమ్మడి కుటుంబము అయితే ఒక పదిమంది ఉంటారు. అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంలా ఉండడం మన భారతదేశ సంప్రదాయం అయినప్పటికి మారుతున్న కాలానికి అనుగుణంగా లేదా కొన్ని కారణాల వల్ల ఉమ్మడి కుటుంబం కాస్త వేర్వేరు కుటుంబాలుగా మారుతున్నాయి. ఏదైనా పండగలు శుభకార్యాలు జరిగినప్పుడు మాత్రం అందరూ కలిసి సంతోషంగా గడుపుతారు. కానీ ఓ కుటుంబంలో మాత్రం ఏకంగా 181 మంది కలిసి ఉన్నారు. ఏంటి అనేది తెలుసుకుందాం.

మిజోరాంలోని బాట్వాంగ్ గ్రామంలో జియోనా చానా అనే వ్యక్తి ఉన్నాడు. అతడికి ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 39 మంది భార్యలు ఉన్నారు. ఈ 39 మంది భార్యలకు కలిసి ఏకంగా మొత్తం 94 మంది పిల్లలు ఉన్నారు. ఈ కుటుంబంలో మొత్తం 14 మంది కుమార్తెలు, వారికి 33 మంది మనవరాలు ఉన్నారు. మొత్తం అందరూ కలిపి కుటుంబంలో 181 మంది ఉన్నారు. వీరందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండడం విశేషం. ఆ ఇంట్లో ఏకంగా వంద గదులకు పైగా ఉంటాయి.

ఇంత పెద్ద కుటుంబాన్ని పోషించాలంటే ఏదైనా పెద్ద వ్యాపారం చేయాలి లేదా బాగా ధనవంతులు అయినా ఉండాలి. కానీ ఇవేవీ కాకుండా జియోనా చానా కేవలం వడ్రంగి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎన్నికల సమయంలో పోటీ చేసే అభ్యర్థులు ఓట్ల కోసం వీరి ఇంటి చుట్టు తిరుగుతూ ఉంటారు. ఈ కుటుంబంలో రోజుకు 45 కిలోల బియ్యం, 25 కిలోల పప్పు వండుతారు. రోజుకు రెండుసార్లు వంట చేస్తారు. ఒక సాధారణ కుటుంబం రెండు నెలలు గడిపే జీవితాన్ని జియోనా చానా కుటుంబం ఒకరోజు గడుపుతుంది.

ఈ కుటుంబం రోజుకు 20 కిలోల పండ్లను తీసుకుంటారు. ప్రతిరోజు ఈ కుటుంబంలో ఎవరిదో ఒకరిది పుట్టినరోజు వస్తూ ఉంటుంది అందరి పుట్టినరోజు గుర్తుపెట్టుకోవడం అసాధ్యం కాబట్టి, ఏదో ఒక విధంగా వారు నిర్వహిస్తారు. ఇంత పెద్ద కుటుంబంలో ఎటువంటి కలహాలు మనస్పర్థలకు తావు లేకుండా, అందరూ కలిసిమెలిసి, కష్టసుఖాలు పాలు పంచుకుంటూ ఆదర్శకుటుంబంగా నిలిచింది.