ఇజ్రాయెల్, హమాస్ యుద్ధానికి 6 నెలలు.. 33వేలు దాటిన మరణాలు

-

 గతేడాది అక్టోబర్‌ 7వ తేదీ తెల్లవారుజామున ఆపరేషన్‌ అల్‌ -అక్సా స్ట్రామ్‌ పేరుతో మెరుపుదాడికి పాల్పడ్డారు హమాస్‌ మిలిటెంట్లు. దాదాపు 1200 మందిని బలిగొనడమే గాక 250 మందికిపైగా బందీలుగా చేసుకుని, గాజాకు తరలించారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఇజ్రాయెల్‌ వెంటనే ప్రతి దాడులను మొదలుపెట్టింది. ఉగ్రవాదుల అంతంతోపాటు బందీల విడుదలే లక్ష్యంగా పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రకటించింది.

అలా మొదలైన ఇజ్రాయెల్‌ – హమాస్‌ యుద్ధానికి నేటితో ఆరు నెలలు పూర్తయింది. 500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న హమాస్‌ సొరంగాల్లో చాలా వరకు ధ్వంసం చేశారు. 13 వేల మంది ఉగ్రవాదులను హతమార్చారు. మరోవైపు ఇప్పటికీ 100కు పైగా బందీలు మిలిటెంట్ల చెరలోనే ఉండటం, గాజాలో 33 వేలమంది ప్రాణాలు కోల్పోవడం, పాలస్తీనీయుల సమస్యలు ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. ఇప్పటివరకు 109 మంది బందీలు సురక్షితంగా విడుదలయ్యారు. ముగ్గురిని సైన్యం నేరుగా కాపాడింది. 36 మంది వరకు బందీలు చనిపోయి ఉండొచ్చని ఇజ్రాయెల్‌ భావిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారని హమాస్‌ చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news