కారును ఎత్తుకెళ్లిన మంచి దొంగ..?

-

అటుగా వెళ్తున్న ఓ దొంగకు స్టాటింగ్‌లో ఉన్న ఓ కారు కన్పించింది. అంతే.. నిమిషం ఆలస్యం చేయకుండా ఆ కారుతో ఉడాయించాడు. ఎత్తుకెళ్తున్న కారులోనే ఓ పసిపాప ఉందని గుర్తించి వెంటనే కారును వెనక్కి తిప్పుకొని వచ్చి ఆ పసిపాపను తల్లికి అప్పగించాడు. కానీ.. కారును మాత్రం ఇవ్వకుండా ఉడాయించాడు. దీంతో ఆ దొంగ పసిపాపను అప్పగించినందుకు మంచోడా..? కారును ఎత్తుకెళ్లడంతో చెడ్డోడా..? అని పోలీసులు సందిగ్ధంతో పడ్డారు.

అమెరికాలోని ఒరెగాన్‌ స్టేట్‌ పోర్ట్‌ల్యాండ్‌లో ఓ మహిళ తన నాలుగేళ్ల కుమారుడిని తీసుకొని బయటకు వెళ్లింది. కారులోనే చిన్నారిని పెట్టి ఆఫ్‌ చేయకుండా కూరగాయలు కొనేందుకు వెళ్లింది. అలా చాలా సేపు కారు స్టాటింగ్‌లోనే పెట్టింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ దొంగకు స్టాటింగ్‌లో ఉన్న కారు కనబడింది. చాలా సేపు ఆ కారు వద్దకు ఎవరూ రాకపోవడంతో ఇదే అదనుగా భావించిన ఆ దొంగ కారు తీసుకొని పారిపోయాడు.

తల్లికి క్లాస్‌..

కొద్దిదూరం వెళ్లగా వెనక్కి తిరిగిచూస్తే ఓ నాలుగేళ్ల పాప ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే యూటర్న్‌ తీసుకొని ఆ దుకాణం వద్దకు వచ్చి.. ఆ చిన్నారిని తల్లికి అప్పగించి ‘‘కారును స్టాటింగ్‌లో పెట్టి పిల్లాడిని వదిలేసి పోతావా, చిన్నారి పట్ట నిర్లక్ష్యంగా వ్వవహరించినందుకు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని’ ఆ మహిళకు తిట్ల పురాణం విన్పించాడు. అలా ఆ తల్లికి క్లాస్‌ పీకుతూనే బుడ్డొడిని ఆమె చేతులో పెట్టాడు. అమ్మదొంగ.. ఎంత మంచి పని చేశావని అభినందించేలోపే అదే కారుతో మళ్లీ ఉడాయించాడు. చిన్నారిని తల్లికి అప్పగించినందుకు పోలీసులు ఆ దొంగను మంచిదొంగ అంటూ ప్రశంసాలతో ముంచెత్తారు. ఈ ఘటన జరిగిన కాసేటి తర్వాత ఆ కారును గుర్తించి సదరు మహిళకు అప్పగించిన పోలీసులు ఆ దొంగను పట్టుకునే పనిలో పడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version