శ్రీలంకలో స్పా ఓనర్స్ అరాచకాలు.. ఉద్యోగాల పేరుతో వ్యభిచారంలోకి

-

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో ప్రజల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆహారం, ఇంధన కొనుగోలుకు సైతం డబ్బులు లేని పరిస్థితికి ఆ దేశ పరిస్థితి చేరుకుంది. దేశ ప్రజలు కనీసం రెండు పూటలు భోజనం చేయలేని దీనస్థితిలో జీవనం కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంలో శ్రీలంకలోని కొలంబోలో స్పా ఓనర్స్ రెచ్చిపోతున్నారు. ఆర్దిక సంక్షోభం నేపధ్యంలో భారిగా ఉద్యోగాలు కోల్పోయిన మహిళలను టార్గెట్ గా ఎంచుకున్నారు.

ఉద్యోగాలు కోల్పోయిన యువతులకు,మహిళాలకు డబ్బు ఆశ చూపి వ్యభిచారంలోకి దింపుతుంది స్పా మాఫియా.పెళ్ళి కాని యువతులతో స్పా పేరుతో వ్యభిచారంలోకి దింపుతున్నారు.మరికొందరికి డబ్బులు ఇచ్చి విదేశాలకు సరఫారా చేస్తున్నరనే ఆరోపణలు వచ్చాయి. దేశంలో పరిస్థితి బాగలేని సమయంలో డబ్బుతో మహిళల జీవితాలు నాశనం చేస్తుంది స్పా మాఫియా.

Read more RELATED
Recommended to you

Exit mobile version