Srilanka: చల్లారని ఉద్రిక్తత…1500 మంది అరెస్ట్

-

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఇప్పట్లో సద్దుమణిగే అవకాశం కనబడటం లేదు. ప్రజలు తీవ్ర అసహనంలో ఉన్నారు. కనీసం పెట్రోల్ కొందాం అనుకున్నా శ్రీలంక ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. దీంతో ప్రజలు పెట్రోల్ బంకుల ముందు పడిగాపులు పడుతున్నారు. పెట్రోల్ కోసం ప్రజల మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే కొత్తగా వచ్చిన ప్రధాని రణిల్ విక్రమసింఘే శ్రీలంక ప్రజలు మరింత ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొవాలని కామెంట్ చేయడంతో రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారే అవకాశం కనిపిస్తోంది. 

ఇదిలా ఉంటే మే 9న శ్రీలంకలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మాజీ ప్రధాని మహిందా రాజపక్సే కుటుంబీకుల ఇళ్లు తగలబెట్టారు. ఆందోళనకారులు, రాజపక్సే వర్గీయులు మధ్య తీవ్ర ఘర్షణ తలెల్తింది. ఈ ఘర్షణల్లో 9 మంది మరణించగా… 200 మందికి పైగా ప్రజలు గాయాలపాలయ్యారు. అయితే ఈ ఘర్షణలతో సంబంధం ఉన్న 1500 మంది ప్రజలను అరెస్ట్ చేసింది శ్రీలంక ప్రభుత్వం. మరోవైపు ఆందోళనలు చల్లారడం లేదు. రాజధాని కొలంబోతో పాటు అన్ని ప్రాంతాల్లో ప్రజలు అధ్యక్షుడు గోటబయ రాజపక్సే గద్దె దిగాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news