సాంకేతిక లోపంతో విమానం కుప్పకూలిన ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. మృతుల్లో నలుగురు సైనికులు ఉన్నారు. ఈ ఘటన సూడాన్‌లోని పోర్ట్ సుడాన్ విమానాశ్రయంలో జరిగింది. ఈ విషయాన్ని ఆ దేశ సైన్యం ధ్రువీకరించింది. పౌరులతో వెళ్తున్న విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తి కూలినట్లు వెల్లడించింది. మృతుల్లో నలుగురు సైనిక సిబ్బంది ఉన్నారని చెప్పింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృత్యుంజయురాలిగా బయటపడిందని తెలిపింది.
ఈ ఘటన జరిగిన వెంటనే సహాయక బృందాలు ఆ ప్రాంతానికి చేరి రక్షణ చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించాయి. ఈ ఘటనలో ఓ చిన్నారి మృత్యుంజయురాలిగా బయటపడినట్లు సహాయక బృందాలు తెలిపాయి. “సాంకేతిక లోపం కారణంగా పోర్ట్ సుడాన్ విమానాశ్రయంలో ఓ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు సైనిక సిబ్బందితో సహా 9 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి ప్రాణాలతో బయటపడింది” అని సూడాన్ ఆర్మీ ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపింది.