తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పుట్టిన రోజు నేడు. ఆయన నేటితో 47వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఓ వినూత్న కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్నే ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఇంతకీ కేటీఆర్ బర్త్ డే ప్లాన్ ఏంటంటే..?
తన 47వ పుట్టినరోజు సందర్బంగా అనాథ పిల్లలకు సాయం చేయాలని మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ యూసఫ్ గూడలోని మహిళా శిశు సంక్షేమ శాఖలో 10వ తరగతి, 12వ తరగతి చదువుకుంటున్న 47 మంది ప్రతిభావంతమైన పిల్లలను వ్యక్తిగతంగా ఆదుకుంటానని ఆయన తెలిపారు.
గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఆ విద్యార్థులకు ఒక్కొక్కరికి ఒక్కో ల్యాప్ ట్యాప్ ఇవ్వడంతో పాటు రెండేళ్ల పాటు తమకు నచ్చిన రంగంలో కోచింగ్ ఇప్పిస్తానని మంత్రి వెల్లడించారు. మరోవైపు తన పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు.. ప్రకటనలకు డబ్బు ఖర్చు చేయకుండా అనాథలకు అండగా నిలవాలని మంత్రి కేటీఆర్ కోరారు.
Have been thinking of a meaningful way to contribute to the orphan children of the State home, Yousufguda run by Women & Child Welfare Department
Tomorrow on the occasion of my 47th birthday I pledge to personally support 47 meritorious children from 10th/12th grades and 47…
— KTR (@KTRBRS) July 23, 2023