ఆడవాళ్లు రెస్టారెంట్​లకు వెళ్లొద్దు.. ఆ దేశ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం

-

అఫ్గానిస్థాన్​లో తాలిబన్ ప్రభుత్వం ఆడవారిపై అడుగడుగునా ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే చదువుకోవడం.. పరీక్షలు రాయడం.. ఉద్యోగాలు చేయడం.. వంటి వాటిపై నిషేధం విధించిన తాలిబన్ సర్కార్ తాజాగా మహిళలు రెస్టారెంట్లకు వెళ్లడంపై నిషేధం విధించింది.

గార్డెన్​లు, పచ్చని ప్రదేశాలు ఉన్న రెస్టారెంట్లలోకి మహిళలు వారి ఫ్యామిలీకి అనుమతి లేదంటూ అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ప్రదేశాల్లో జెండర్​ మిక్సింగ్​ అవుతుందని మత గురువులు ఇచ్చిన ఫిర్యాదుతో తాలిబన్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు హెరాత్ ప్రావిన్స్‌లో పచ్చని ప్రదేశాలతో ఉన్న రెస్టారెంట్‌లకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని తాలిబన్​లు తెలిపారు.

“ఈ రెస్టారెంట్లలోకి పురుషులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రస్తుతం ఈ నిబంధనలను హెరాత్‌ ప్రావిన్స్​కు వరకు మాత్రమే పరిమితం చేస్తున్నాం. గార్డెన్​ ఉన్న రెస్టారెంట్లలో జెండర్​ మిక్సింగ్​ కావడం, మహిళలు హిజాబ్​ ధరించటం లేదన్న ఆరోపణలతోనే ఈ నిషేధం విధిస్తున్నాం. పార్క్​లు, పచ్చని ప్రదేశాలు, మహిళలు, పురుషులు కలుసుకోవడానికి వీలున్న రెస్టారెంట్లకు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయి.” అని మినిస్ట్రీ ఆఫ్ వైస్ అండ్ వర్ట్యూ డైరెక్టరేట్‌ డిప్యూటీ అధికారి బాజ్ మహమ్మద్ నజీర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version