100 గంటలు ఏడుస్తానని ప్రకటన.. 6 గంటల పాటు ఏడవగానే..?

-

సరికొత్త రికార్డులు సృష్టించి గిన్నిస్ బుక్​లోకి ఎక్కాలని.. లేదా సోషల్ మీడియాలో వ్యూవర్స్​ సంఖ్యను పెంచుకోవాలని చాలా మంది తమ ప్రాణాలు పణంగా పెట్టి మరీ వింత పోకడలకు పోతున్నారు. తాజాగా ఇలాగే ఓ యువకుడు కూడా ట్రై చేశాడు. కానీ కాస్త వెరైటీగా అతడు 100 గంటలు ఏడుపు మారథాన్ మొదలుపెట్టాడు. షురూ అయితే చేశాడు కానీ ఆ తర్వాతే అసలు కథ షురూ అయింది. ఇంతకీ ఏమైందంటే..?

టెంబు డేనియల్‌ అనే నైజీరియన్‌ ‘237 టౌన్‌ క్రయర్‌’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నిర్వహిస్తున్నాడు. తాను 100 గంటల ‘ఏడుపు మారథాన్‌’ ప్రారంభించబోతున్నట్లు ముందుగా పోస్టర్‌ ప్రకటన చేసి.. తీరా ఈ నెల 9న ఆ కార్యక్రమం ప్రారంభించిన ఆరు గంటల్లోనే ‘‘ఇక నావల్ల కాదు’’ అంటూ విరమించుకున్నాడు. ఏడుపు ప్రారంభించిన కాసేపటికే.. భరించలేని తలనొప్పి, కళ్లవాపు, ముఖం ఉబ్బడం, 45 నిమిషాలపాటు కంటిచూపు మసకబారడంతో భయపడ్డాడు. ఈ మారథాన్‌ కొనసాగిస్తే ప్రమాదమని ముందే గుర్తించి.. మధ్యలోనే ఆపేశానని డేనియల్‌ ఓ మీడియా సంస్థకు తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version